prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 7:55 am Digital Edition : RAJASHEKARREDDY

మసీదు దారి ఆక్రమణపై పోలీసులకు ముస్లిం సంఘం ఫిర్యాదు

 

బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో స్థానిక మసీదుకు వెళ్లే ప్రవేశ మార్గాన్ని ఫెన్సింగ్ వైర్‌తో మూసివేసి ఆక్రమించారని ఆరోపిస్తూ బెజ్జంకి ముస్లిం సంఘం ప్రతినిధులు శుక్రవారం బెజ్జంకి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.మసీదుకు నమాజ్‌కు వచ్చే భక్తులు ప్రవేశ మార్గం మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి, ఆక్రమణను తొలగించి మసీదుకు వెళ్లే దారిని పునరుద్ధరించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ప్రార్థనా స్థలానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులు న్యాయబద్ధమైన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముస్లిం సంఘం ప్రతినిధులు పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముస్లిం సంఘం నాయకులు కోరారు.