prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:35 am Digital Edition : PRAJA VANI

మల్కాపూర్‌లో ఎస్‌ఐఆర్ దరఖాస్తుల ప్రక్రియపై తహసీల్దార్ అశోక్ ఆకస్మిక పరిశీలన

.

90 శాతం దరఖాస్తుల నమోదు పూర్తి.. మిగిలిన వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశం.

కొండాపూర్, ఆగస్టు 6 (ప్రజావాణి):
మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కొండాపూర్ తహసీల్దార్ అశోక్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుల నమోదు పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ మాట్లాడుతూ, మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తుల్లో ఇప్పటికే 90 శాతం ఫారాలు విజయవంతంగా స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా వచ్చే రెండు రోజుల్లో పూర్తి చేసి శాతం వంద నమోదు లక్ష్యాన్ని సాధించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు సూచించారు. గ్రామస్థులు కూడా సహకరించి ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి దరఖాస్తు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు, అనంతయ్య, ప్రవీణ్ ,లక్ష్మణ్ ,ఆర్‌ఐ నిఖిల్, జీపీఓ రాందాస్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ బలరాం బిఎల్వోలు , బి ఎల్ ఏ లు,సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.