కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) తొట్టిగారిపల్లె మలేరియా అంతం మనతోనే సాధ్యమని తొట్టిగారి పల్లె వైద్యాధికారి రాజేష్ కుమార్ అన్నారు.బద్వేల్ మండలంలోని, తొట్టిగారి పల్లెలో,శనివారం ఉదయం ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మలేరియా అంతం మనతోనే సాధ్యమని,బ్యానర్ చేతపట్టి, పలు వీధులలో ర్యాలీ నిర్వహించారు.లార్వాదశలోనే దోమలను అరికట్టాలని,దోమల నివారణకు దోమతెరలే శ్రేయస్కరమని,పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలంటూ,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ దోమ ద్వారానే చికెన్ గున్యా, మలేరియా,డెంగ్యూ, మెదడువాపు వ్యాధి,బోధకాలు పలు రకాల వ్యాధులు వస్తాయన్నారు మలేరియా సబ్ యూనిట్ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ,సిబ్బందిచే తాము ఇంటింటి లార్వా,ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు.లార్వా ఉన్నచోట నీటిని పడవేస్తున్నామన్నారు.డ్రైనేజీ కాలువలో,నిల్వ ఉన్న నీరు,తడి ప్రదేశాలలో అబేట్,ఆయిల్ బాల్స్,బ్లీచింగ్ పౌడర్ ను చల్లిస్తున్నామన్నారు.అవసరమైన చోట మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు.104,విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ప్రజల వద్దకే వైద్యం అందుతుందన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు సమృద్ధిగా ఉన్నాయన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ చంద్రావతి,హెల్త్ అసిస్టెంట్లు వీరి జనార్దన్ రావు, శ్రీరామయ్య,వెంకటసుబ్బయ్య,వైద్య సిబ్బంది మహేంద్ర సుబ్బరాయుడు,ఈశ్వరమ్మ, ఏఎన్ఎం ,ఆశాలు పాల్గొన్నారు