మరణం జరిగే వరకు మౌనమేనా..? ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రహరీ లేక ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యపు ఆట ఆడుతున్న విద్యుత్ శాఖ!”

  నేరేడుచర్లలో తీవ్ర ఆగ్రహం - హెచ్చరించినా kadhala  అధికారులు. నేరేడుచర్ల(ప్రజావాణి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఇప్పటికీ రక్షణ కంచె (ఫెన్సింగ్) లేదా ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం ప్రజల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ సమస్యపై ఇప్పటికే పలు మార్లు వార్తలు ప్రచురితమైనప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రధాన రహదారి పక్కనే పూర్తిగా బహిరంగంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద...