కాశినాయన ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 06) కాశినాయన మండల పరిధిలో ఘనంగా బిజెపి 47 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.మన ఊరు- మన జెండా’ తో బీజేపీ కొత్త వ్యూహం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు జంగటి వెంకటసుబ్బారెడ్డి సూచనలు మేరకు బిజెపి కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల, నారాయణరెడ్డి,భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనత పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాశినాయన మండలంలోని అన్ని బూతులలో మన ఊరు మన జెండా కార్యక్రమం లో భాగంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6 ముంబాయి మహానగరంలో భారత రత్న దివంగత భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారు అధ్యక్షులుగా ప్రారంభమైన పార్టీ ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో 18 కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని కేంద్రంలో 5 సార్లు అధికార పీఠాన్ని అధిరోహించిందని మిత్ర పక్షాలతో కలసి దేశంలో 20 కి పైగా రాష్ట్రాలలో అధికార పగ్గాలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తోందని తెలిపారు ప్రపంచ దేశాలలో ప్రస్తుతం 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనదేశం నిలిచిందని రాబోవు 2047 వంద సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండేల వికసిత భారత లక్ష్యంగా గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పని చేస్తున్నారని వారికి అండగా ఉండి వారి తెచ్చిన సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రతి కార్యకర్త పని చేయాలని తెలిపారు . జెండా ఆవిష్కరణ అనంతరం కేకులు కట్ చేసి స్థానిక ప్రజలతో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ అవినీతి రహిత పాలన, కులమత విద్వేషాలు లేని సమాజం, అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మండలంలో వివిధ ప్రదేశాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, ఓబిసి మోర్చ మండల అధ్యక్షుడు తోడేటి మునీంద్ర,బుసిరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, పోలేరు,రామయ్య, రామాంజనేయులు, ఓబులమ్మ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.