prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:10 pm Digital Edition : GIRIBABU KONDHURG

మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం – 3 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు

మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం – 3 హెచ్‌పీ మోటార్ ఏర్పాటు

మన్మర్రి గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామ సర్పంచ్ లాలపేట బంధయ్య చర్యలు చేపట్టారు. పాడైపోయిన మోటారును రిపేర్ చేయించి, ఈరోజు దర్గా సమీపంలోని బోరుకు 3 హెచ్‌పీ మోటార్‌ను అమర్చించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంధయ్య, డిప్యూటీ సర్పంచ్ బేగరి శంకరయ్య, సెక్రటరీ శివకుమార్ గౌడ్, వార్డు సభ్యులు గుడిసె నరేష్, ఎర్రవల్లి రాజు, దండు నర్సింలు పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచ్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు ఈడిగి యాదయ్య, కావలి యాదయ్య, గాలయ్య, రాజలింగం, పి. రాంరెడ్డి, పి. భూపాలరెడ్డి, పరమేష్ తదితరులు హాజరయ్యారు.