*మనస్థాపంతో యువకుని ఆత్మహత్య*
*మన ప్రజావాణి*మందమర్రి* మే 5
మండలంలోని సండ్రోన్ పల్లి గ్రామానికి చెందిన ఎదుల రాజ్ కుమార్ (28) గ్రామంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, సండ్రోన్ పల్లి గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రాజ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. అతని మద్యపాన అలవాటు వల్ల కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజ్ కుమార్ తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గ్రామంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృదేహాన్ని పరిశీలించి, అనంతరం రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజ్ కుమార్ తల్లి ఏదుల లస్మక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.
