మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వాఖ్యలు సిగ్గుచేటు.విద్యార్థులకి క్షమాపణలు చెప్పాలి. ఎస్ఎఫ్ఐ
ప్రజావాణిన్యూస్(మార్చి21)గరికపాటి నరసింహారావు పేద పిల్లలకు అందించే మథ్యాహ్నభోజన పథకంపై అహంకారపు అక్కసు వెళ్ళగక్కడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) కడప నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.వాఖ్యలను వెనక్కి తీసుకుని,క్షమాపణ చెప్పాలని శనివారం విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రవచనాల పేరుతో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అమానవీయం.పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని,చదువు "మిధ్య" అయిపోయిందని అనడం పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.మధ్యాహ్న భోజనం పిల్లలు...