మధ్యాహ్న భోజనం లో పురుగులు సాంబార్ నీళ్ల చారు
చిన్నశంకరంపేట, ఆగస్ట్06, మనప్రజావాణి: మండలంలోని శాలిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చిట్టెలు కట్టిన బియ్యం రావడంతో ఇవే బియ్యం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టెలు, పురుగులు పట్టిన బియ్యం సంచులను వాపసు చేయవలసి ఉండగా ఉపాధ్యాయులు కనీసం మర్చిపోయి ఇట్టి బియ్యాన్ని చూడకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెదలు పట్టిన, పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన...