చిన్నశంకరంపేట, ఆగస్ట్06, మనప్రజావాణి: మండలంలోని శాలిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చిట్టెలు కట్టిన బియ్యం రావడంతో ఇవే బియ్యం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టెలు, పురుగులు పట్టిన బియ్యం సంచులను వాపసు చేయవలసి ఉండగా ఉపాధ్యాయులు కనీసం మర్చిపోయి ఇట్టి బియ్యాన్ని చూడకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెదలు పట్టిన, పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా పురుగులు పట్టిన అన్నం తింటే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనంలో కూరగాయలు అందించడం లేదని, మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయని, నాసీ రకమైన కూరగాయలు నీళ్ల చారు పోస్టూ, ప్రతిరోజు మిల్ మేకర్ కర్రీలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుండి మామిడికాయ పచ్చడి తెచ్చుకొని తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.