మధ్యాహ్నం 12 దాటినా తెరచుకోని సచివాలయం: విధులకు అధికారుల డుమ్మా, తీవ్ర ఇబ్బందుల్లో టేగురుపేట గ్రామస్తులు

టేకురుపేట ( ఆగస్టు 01 ప్రజావాణి):ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటకే అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థ క్షేత్రస్థాయిలో గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేగురుపేట గ్రామ సచివాలయం (స్వర్ణ గ్రామం) అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలు దాటుతున్నప్పటికీ, ఈ సచివాలయం ఇంకా తాళం వేసే ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....