సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి
సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి పదిహేను (15) రోజుల జైలు శిక్ష విధించారు.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు.మల్కాపురం పరిశరములు(39) తండ్రి యాదయ్య , నాంచారుపల్లి నివాసం, సిద్దిపేట జిల్లా,ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్”నిర్వహించడం జరుగుతుందన్నారు.
.