మద్యం తాగొద్దని మందలించడంతో గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
తంగళ్లపల్లి, ప్రజావాణి ఆగస్టు 6: తంగళ్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు మద్యం సేవించడం మానుకోవాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అట్టె మల్లేశం (55), కురుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా మద్యానికి బానిసగా మారినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు పలుమార్లు సూచించడంతో మనస్తాపానికి గురైన...