మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు…

దుబ్బాక, మార్చి 29, ప్రజావాణి నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం జరిగింది. దుబ్బాక సీఐ రాజేష్, తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు నరేష్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు.వీరికి ఒక ఇల్లు తో పాటు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.రెండవ కుమారుడు స్వామి, మూడవ కుమారుడు ఎల్లం ప్రతిరోజూ మద్యం సేవించి, తల్లిదండ్రులను...