కడప జిల్లా,ప్రజావాణి న్యూస్ (మర్చి26)పోరుమామిళ్ల మండల పరిధిలోని గుర్రప్పగారిపల్లె సమీపాన,సగిలేరు ఒడ్డున వెలిసిన మన నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మద్దిమాను గురప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా శ్రీ నాగిరెడ్డి మల్లికార్జున రెడ్డ గారు ఈరోజు అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని,బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కే.విజయమ్మ గారు, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ కే.రితేష్ రెడ్డి గారితో కలిసి నూతన చైర్మన్ గారిని పూలమాల మరియు శాలువాతో ఘనంగా సత్కరించి,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ అభినందన సభలో బద్వేల్ కూటమి అభ్యర్థి శ్రీ బొజ్జ రోషన్ గారు పాల్గొని నూతన కమిటీకి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ కార్యక్రమంలో రోడ్ కార్పొరేషన్ డైరెక్టర్ సాధన కారి రంతూ,బద్వేల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి, కడప జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య,రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకురి రమణ,కాశినాయన మండలం సొసైటీ అధ్యక్షుడు బంగారు గురువు రెడ్డి పోరుమామిళ్ల సొసైటీ అధ్యక్షుడు కల్లూరి కృష్ణారెడ్డి ఎల్ ఎస్ పి డ్యామ్ చైర్మన్ ఈగ వెంకటరమణారెడ్డి పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, జనసేన నాయకుడు నందకిషోర్, బీజేపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు బద్వేల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉట్టి శ్రీనివాసులు, బద్వేల్ అసెంబ్లీ BLA 1 బిజి వేముల భాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు. వీరితో పాటు బి కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బద్వేలు, బి.కోడూరు,కాశినాయన,మండలాల బీజేపీ అధ్యక్షులు మరియు పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలు హాజరయ్యారు. చైర్మన్ నాగిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారితో పాటు కమిటీ సభ్యులుగా బాల్ రెడ్డి, బాబు,గుర్రప్ప స్వామి, ప్రభావతి, భారతి, గోపాలమ్మ, కొండమ్మ, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, ధనరాజు, బాల శేఖరులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో,దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాన్ని హర్షధ్వానాల మధ్య జయప్రదం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.