మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) పోరుమామిళ్ల పట్టణంలో మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వెటర్నరీ డాక్టర్లను ఘనంగా సన్మానించారు. జంతు సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ శ్రీ ముత్యాల ప్రసాద్,మండల వైస్ ఎంపీపీలు శ్రీ సి. బాషా,శ్రీ చెన్ను రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుసంవర్ధక రంగానికి సేవలు అందించడం గర్వకారణమని,తమ బాధలను...