అన్నమయ్య జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13)మదనపల్లె పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి.పావని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఇది తొలి పోస్టింగ్. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి విధుల్లో చేరినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే గంజాయి రవాణా, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని, మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందేలా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు.డీఎస్పీ పావని మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కట్టుబడి పనిచేస్తానన్నారు.