prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 4:11 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మత సామరస్యానికి ప్రతీక  ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

ప్రజావాణిన్యూస్(మార్చి19)విజయవాడ మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు.అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు.పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అల్లినగర్‌లో మస్జీద్ ఏ అలీ మసీదుకు టిడిపి బిసి విభాగం రాష్ట్ర నాయకులు గుర్రం కొండా నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చిని పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కులాలు,మతాలు వారు కలసి ఉంటారని,మత సామరస్యంకు ప్రతీకగా ఉంటారన్నారు.గడచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ వచ్చిందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లీం సోదర,సోదరీమణులే కారణమన్నారు.ముస్లీంలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం,చిట్టినగర్‌లలో షాదీఖానాల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకుంటానని,నిధులు కేటాయింపులు చేస్తానన్నారు.ఏ మసీదు అభివృద్ధికైనా తన సంపూర్ణ సహకారం అందిస్తానని వివరించారు.మత సామరస్యంను చాటుతూ తన డబ్బు వెచ్చించి టిడిపి బీసీ నేత గుర్రం కొండ మసీదుకు ఆర్చి నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో 46 డివిజన్ ప్రెసిడెంట్ పోతినీడు లోకేష్,47 డివిజన్ ప్రెసిడెంట్ నాగోతి రామారావు కార్యదర్శి ధనాల శ్రీను,47వ డివిజన్ జనరల్ సెక్రెటరీ కట్టా సాంబయ్య ,మైనార్టీ నాయకులు షేక్ అర్షద్,ఫైజాన్,52 డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి 45వ డివిజన్ టిడిపి అధ్యక్షులు ప్రేసిడెంట్ పేరం సత్యనారాయణ 52 డివిజన్ ప్రెసిడెంట్ ఈగల్ సాంబ,51 డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు ,నగరాలు కార్పొరేషన్ డైరెక్టర్ బెవర సాయి సుధాకర్రెల్లి సంఘం నాయకురాలు తుపాకుల రమణమ్మ,35 డివిజన్ అధ్యక్షులు షేక్ నంద కుమారి,50 డివిజన్ అధ్యక్షులు కొప్పుల అరుణశ్రీ,కో క్లస్టర్ ఇన్‌ఛార్జి కొప్పల గంగాధర్ రెడ్డి ,సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు ,తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ,ఉపాధ్యక్షులు కే భవాని శంకర్నా యకులు కసిమికోట మల్లేశ్వరి దేవలక్ష్మి తదితరులు పాల్గొనగా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు,నమాజ్డి న్నర్ కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొని మసీదు కమిటీ పెద్దలకు,ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.