నెల్లూరు జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, జువ్వల దిన్నెకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15 తేది రానున్న సందర్భంగా కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు,శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం గారు, పుట్టా శివశంకర్ గారు, మత్స్యకారులు, వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి జువ్వల దిన్నె వద్ద, హెలీపాడ్ స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని, ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.తొలుత కావలిలోని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో, ఆయనతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి,నివాళులర్పించిన కాకాణి- మత్స్యకారుల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తుంది జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిగా మత్స్యకారులకే కేటాయించాలి,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మించారు. నెల్లూరు జిల్లా, మత్స్యకారుల చిరకాల స్వప్నమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదు,గత వైయస్ఆర్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అత్యంత ప్రాధాన్యతతో నిర్మించారు.కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లుతూ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సాగర్ డిఫెన్స్ కు అప్పగించాలని చూస్తున్నారు.హార్బర్‌ను నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నారు.భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే, మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ రోడ్డుపైకి కూడా వచ్చే అవకాశం ఉండదు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు. మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేది లేదు.మత్స్యకారుల సంక్షేమానికి జగనన్న కట్టుబడి ఉన్నారు.కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి , కేవలం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎన్నికలు వచ్చాయి,కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.ప్రస్తుతం ఉన్న అరకొర వసతులతోనే మత్స్యకారులు ఇబ్బందులు పడుతూ, హార్బర్‌ను వినియోగించుకుంటుంటే దానిని ప్రవేటీ కరణ చేయడం ఆవేదన కలిగిస్తుంది.ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేయాల్సింది పోయి, ఉన్న తీర ప్రాంతాన్ని సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరం.పరిశ్రమలు లేదా డిఫెన్స్ కు అవసరమైన తయారీ విభాగాలు రావడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తూ తీర ప్రాంతాన్ని ప్రైవేట్ పరం చేయడం సరికాదు. ఇప్పటికే రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో స్థలాన్ని కేటాయిస్తే, భవిష్యత్తులో బోట్ల సంఖ్య పెరిగినప్పుడు మత్స్యకారులు ఎక్కడికి వెళ్లాలి?”మాకు మత్స్యకారుల ప్రయోజనాలే ముఖ్యం, పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులను తక్షణమే పూర్తి చేసి, ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి అలా చేస్తేనే ఈ ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి లభిస్తుంది, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కంటే మత్స్యకారుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలి,జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో మత్స్యకారుల ఆస్తిగా భావించి, అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్‌ను నేడు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం దుర్మార్గం,సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థ కార్యకలాపాలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే, ఈ ప్రాంతంలో మత్స్యకారులు తిరగకుండా పోలీసులతో ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదు. ఇది “నిషిద్ధ ప్రాంతం” అంటూ ప్రకటించడం మత్స్యకారులను వంచించడమే, సాగర్ డిఫెన్స్ కార్యకలాపాల కోసం వేరే అనువైన ప్రదేశం ఉంది, పక్కనే ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని విస్తరించి వాడుకోవచ్చు,రేపు పొద్దున్న సాగర్ డిఫెన్స్ సంస్థ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే, కనీసం రోడ్డు మీద నడిచే హక్కు కూడా మత్స్యకారులకు ఉండదు, వారిని తమ సొంత ప్రాంతం నుంచే వెలివేసే పరిస్థితి వస్తుంది, మత్స్యకారులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం, వారి నోటికాడ అన్నం తీసి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనం,మత్స్యకారులు తమ సొంత హార్బర్‌లోకి వెళ్లేందుకు ప్రవేట్ సంస్థ దగ్గర అనుమతి తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది,నారా లోకేష్ శంకుస్థాపన చేసిన రోజు నుంచే హార్బర్ వద్ద ఆంక్షలు మొదలయ్యాయి, సాగర్ డిఫెన్స్ సంస్థకు భూమి కావాలంటే సముద్ర తీరంలో వేరే చోట కేటాయించాలి కానీ, మత్స్యకారుల కోసం నిర్మించిన హార్బర్‌ను లాక్కోవడం దుర్మార్గం,
జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది.మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.జగన్ మెహన్ రెడ్డి గారు వస్తున్నారనే వార్తతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ వణుకుతున్నారు.మత్స్యకార సోదరులందరికీ అండగా ఉంటూ, వారి అభివృద్ధి కోసం పాటుపడతామని, వారికి అండగా ఉంటామని తెలియజేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేయనున్నారు .మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా స్థానిక మత్స్యకారులు, రైతులు మరియు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడ కి రావడం సంతోషం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మత్స్యకార సమాజం చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలి,మత్స్యకారుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది.సాగర్ డిఫెన్స్ మరియు ప్రైవేటీకరణ అంశాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, మత్స్యకారులకు అండగా నిలవాలని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.మత్స్యకారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక ఇంటరాక్టివ్ సెషన్ (ముఖాముఖి) ఏర్పాటు చేస్తున్నాం .మత్స్యకారుల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,మత్స్యకారుల మధ్య గొడవలు పెట్టేలా చేస్తోంది.జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఫిషింగ్ హార్బర్లు తీసుకువచ్చారు.జగన్ గారి పర్యటన నిమిత్తం ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తల్శిల రఘురాం, మరియు పార్టీ నేత పుట్టా శివశంకర్ రెడ్డి గార్ల తో కలిసి పర్యవేక్షించాం.ఇప్పటికే హెలిప్యాడ్ అనుమతుల కోసం కలెక్టర్ మరియు ఎస్పీ గార్ల లకు దరఖాస్తు చేశాం. ప్రభుత్వం తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వై ఎస్ ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుంది.ఇది ఆరంభం మాత్రమే” అవసరమైతే చంద్రబాబు, లోకేష్‌ల, ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతాం.జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా మత్స్యకారుల్లో భరోసా నింపడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కడుతాం, మత్స్యకారులకు అండగా నిలుస్తాం.