*మఠం మండలంలో భూమిలేని పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి మార్చి నెలలో పేదలకు భూ పంపిణీ అమలు చేయకపోతే ఏప్రిల్ లో భూ పోరాటాలు నిర్వహిస్తాం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
జి. శివకుమార్ హెక్కరిక బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో సోమిరెడ్డి పల్లె, నరసన్న పల్లె ముడమల, నేలటూరు పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె, కొందువారి పల్లె,
మల్లె గుడిపాడు తదితర గ్రామాలలో భూ కబ్జాదారుల వద్దనున్న భూములను స్వాధీనం చేసుకోవటం భూమిలేని నిరుపేదలకు నెల రోజుల్లో భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్,అన్వేష్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
శనివారం ఉదయం స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మఠం మండల కమిటీ ఆధ్వర్యం మండల భూ సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గండి సునీల్ అధ్యక్ష వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.శివకుమార్ వి.అన్వేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు మూడు నెలల నుంచి బ్రహ్మంగారిమఠంలో పదివేల ఎకరాలు అన్యక్రాంతమైనాయని భూకబ్జాదారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల ఆక్రమించారని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు, కానీ ఆ భూములను భూ పంపిణీకి మూడు నెలలైనా నోచుకోలేదని అన్నారు, 9వేల ఎకరాలు అక్రమణకు గురైణాయని mla గారు చెపుతున్నారు కానీభూ కబ్జాదారుల ఒక్కరి పైన కూడా కేసు నమోదు చేయకపోవడం అత్యంత దారుణం అన్నారు
మండల పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నయని బ్రహ్మంగారిమఠం మండలంలో కుటుంబానికి 5 ఎకరాలు చొప్పున ఇచ్చిన ఇంకా మిగులు భూములు ఉంటాయని తెలిపారు
గత 12 సంవత్సరాల నుంచి పరిపాలించిన టిడిపి వైసిపి కూటమి ప్రభుత్వం పేదలకు సెంటు భూమి కూడా భూ పంపిణీ అమలు చేయడం లేదు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు పలకబడి కలిగిన వారు ధనవంతులు ప్రజాప్రతినిధులు వందల ఎకరాలను కబ్జా చేశారనివారు ఆరోపించారు,వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల కోసం వచ్చిన పాలక పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ భూ పంపిణీ అమలు చేయాలని ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పక్కా గృహాలకు ఐదు లక్షల రూపాయలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 20 సంవత్సరాల నుంచి సక్రమంగా అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయటం అత్యంత దుర్మార్గం అన్నారు దాని స్థానంలో విబిజి రాంజీ స్కీం వల్ల రాష్ట్రాల పైన 40 శాతం నిధులు జమ చేయాలని గుదిబండ వేశారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం గ్రామీణ వలసలు నివారించడాన్ని పూర్తిగా విస్మరించిందని ఆచరణలోనే విబిజి రాంజీ స్కీమ్ ద్వారానే అర్థమవుతుందన్నారు కరోనా సమయంలో వలస కార్మికులు ఎన్ని వేలమంది స్వగ్రామాలకు చేరుకున్నారో అర్థమవుతుంది కాబట్టి వలస కార్మికులను నివారించడానికి డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని అన్నారు మఠం మండల పరిధిలోని గ్రామాలలో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి దస్తగి రెడ్డి కెవిపిఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి జకరయ్య జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలోమండల కార్యదర్శి గోవింద్స్వా మి,అధ్యకురాలు సుబ్బమ్మ,హరి,అజయ్,నరసింహ విద్యార్థి సంఘం నాయకులు రాహుల్ మహిళా సంఘం నాయకురాలు రవణమ్మ తదితరులు మాట్లాడారు