మఠంపల్లిలో వసూళ్ల దందా ఆరోపణలు పత్రిక పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు

మఠంపల్లిలో వసూళ్ల దందా ఆరోపణలు పత్రిక పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు మఠంపల్లి, ఫిబ్రవరి 21: మఠంపల్లి మండలంలో పత్రిక పేరుతో కొంతమంది వ్యాపారుల వద్ద వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపులు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ స్థానిక వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఒక పత్రికలో ప్రచురితమైన ఫర్టిలైజర్ షాప్‌కు సంబంధించిన వార్తపై వివాదం నెలకొంది. సంబంధిత ఫర్టిలైజర్ యజమాని ప్రకారం, “నిషేధిత బయో మందులు అమ్ముతున్నారని ఆరోపిస్తూ ముందుగా ఫోన్ చేసి...