మట్టి గొంతుకకు అరుదైన గౌరవం, సింగర్ చుంచు నాగవ్వకు కేటీఆర్ ఘన సన్మానం!

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జూన్ 02 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మట్టి వాసనల జానపదానికి, తెలంగాణ గ్రామీణ గొంతుకకు దక్కిన అరుదైన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన సామాన్య మహిళ, జానపద గాయని చుంచు నాగవ్వ సాధిస్తున్న విజయాలు, ఆమెకు లభించిన ఘన సన్మానం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల యూట్యూబ్ వేదికగా "బాయిలోనే బల్లి పలికే"...