మందు’ పాతర మెడికల్ షాపుల్లో దోపిడీ.బెంబేలెత్తుతున్న రోగులు!

పోరుమామిళ్లజూన్7ప్రజావాణి పోరుమామిళ్ల (మండల కేంద్రం):నిరుపేద,మధ్యతరగతి ప్రజల ఆరోగ్య అవసరాలను ఆసరాగా చేసుకుని పోరుమామిళ్ల మండలంలోని పలు మెడికల్ షాపుల నిర్వాహకులు నిలువు దోపిడీకి తెరలేపారు. జీవన గమనంలో అత్యవసరమైన మందుల అమ్మకాల్లో ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని పిండుకుంటున్నారు. రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా,ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లినా.చివరకు మందుల కొనుగోలు కోసం మెడికల్ షాపులకు రావాల్సిందే. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు వ్యాపారులు మానవత్వాన్ని మరచి కాసుల కక్కుర్తితో విపరీతమైన రేట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎంఆర్పీ (MRP) పేరుతో మాయాజాలంసాధారణంగా...