prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 1:43 pm Digital Edition : PRAJA VANI

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తీరునున్న తాగునీటి కష్టాలు -సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి. రామగిరి,ఫిబ్రవరి 03

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో తీరునున్న తాగునీటి కష్టాలు
-సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి.

రామగిరి,ఫిబ్రవరి 03

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గడ్డం పల్లెలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వచ్చే వేసవి కాలం దృష్ట్యా సమస్యకి పరిష్కారం చూపాలని గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి వివరించగా సానుకూలంగా స్పందించి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి ప్రభావిత గ్రామమైన సుందిల్ల గ్రామ త్రాగునీటి సమస్య తీర్చాలని,సింగరేణి అధికారులతో మాట్లాడి సింగరేణి నిధులతో సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో మంగళవారం గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉపసర్పంచ్ జనగామ సదానందం,వార్డు మెంబర్లు ఈగ ప్రశాంత్, విజయగిరి సదాశివ చారి, జనగామ స్టాలిన్,లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ కొరకొప్పుల సత్యం గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,కారే శంకర్,జునగరి శంకర్,సమక్షంలో పూజ కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్లు వేయడం జరిగింది.మంత్రి శ్రీధర్ బాబు ప్రజాపాలన పట్ల హోసింగ్ బోర్డు,గడ్డం పల్లె వాసులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ…..ప్రజల కష్టాలు తెలుసుకొని తాగునీటి సమస్య తీర్చిన తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాటలు కాదు చేతల్లో చూపించే భగీరథుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అని,ఆయన స్పందించిన తీరు పట్ల ప్రజా పాలన పట్ల హౌసింగ్ బోర్డు,గడ్డం పల్లె వాసులు కాంగ్రెస్ పార్టీ పార్టీ పాలనలో జరుగుతున్న అభివృద్ధి,సమస్య పరిష్కారానికి సహకరించిన గ్రామ కాంగ్రెస్ నాయకుల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.