కడప జిల్లా( జులై16 ప్రజావాణి)జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దాల్మియా సిమెంట్ ప్లాంట్ (లైన్-2)3,100 కోట్ల మెగా విస్తరణ పనుల శంకుస్థాపన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్‌ను బద్వేల్ నియోజకవర్గ కూటమి ప్రతినిధి, బద్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఆమె సాదరంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతిపై చర్చ ఈ పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో చైర్‌పర్సన్ సుప్రజ బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి,స్థానిక రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన,మరియు పోరుమామిళ్ల,బద్వేల్ ప్రాంతాల్లో యువతకు విద్యా, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూటమి ప్రభుత్వం తరఫున అందించాల్సిన మద్దతుపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేగాన్ని పెంచుతూనే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన మార్కెట్ యార్డుల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి లోకేష్ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. జమ్మలమడుగులో ప్రారంభమైన దాల్మియా సిమెంట్ ప్లాంట్ రెండవ లైన్ విస్తరణ ద్వారా సుమారు 1,000 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన వివరించారు.కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, దాల్మియా విస్తరణ వంటి భారీ పెట్టుబడులు రావడం పట్ల మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ సుప్రజ హర్షం వ్యక్తం చేస్తూ,కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలను కొనియాడారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో,ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,అలాగే కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.