prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 11:50 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం

ఈరోజు గోపవరం మండలంలో “మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం MPDO కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మీ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా వేసవికాలంలో తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది.”జలధార- జల హారతి’ కార్యక్రమం గురించి మండల స్థాయి అధికారులకు మరియు MPTC లకు అవగాహన కల్పించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు వారి శాఖ తరపున ప్రగతి నివేదికలు మరియు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సమావేశంలో గోపవరం ZPTC సభ్యులు జయ రామి రెడ్డి గారు,Mpdo వి.శ్రీధర్, మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొనడం జరిగింది.