prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 2:39 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మండల కాంగ్రెస్ నియామకాల్లో విశ్వకర్మలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కాంగ్రెస్ మండల సంస్థాగత నియామకాల్లో విశ్వకర్మలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విశ్వకర్మ సంఘం జిల్లా నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్ పోలోజు శ్రీనివాస్ కోరారు. జగిత్యాల జిల్లా కమిటీలో తమ సామాజిక వర్గాన్ని విస్మరించి మొండిచేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో అంకితభావంతో పనిచేసి, అధికారంలోకి రావడానికి కృషి చేసిన తమకు.. మండల కమిటీలు, అనుబంధ సంఘాల నియామకాల్లోనైనా తగిన ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.