prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 3:51 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మంగళగిరి లాడ్జ్‌లు, హోటళ్లపై పోలీసుల అకస్మిక తనిఖీలు

ప్రజావాణిన్యూస్(మార్చి21)గుంటూరు జిల్లా,మంగళగిరి లాడ్జ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు తావులేదు.లాడ్జ్ యాజమాన్యాలకు పోలీసుల హెచ్చరిక.లాడ్జ్‌లలో నిబంధనలు తప్పనిసరి.ఉల్లంఘిస్తే కేసులు ఖాయం.పేకాట,అసాంఘిక చర్యలపై కఠిన చర్యలు.రెసిడెన్షియల్ హోటళ్లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.శనివారం మంగళగిరి రూరల్ మండల పరిధిలోని లాడ్జ్‌లు,రెసిడెన్షియల్ హోటల్ గదులపై పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్,ఆదేశాల మేరకు,మంగళగిరి డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ,సీఐ బ్రహ్మం పర్యవేక్షణలో గ్రామీణ ఎస్సైల ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి.తనిఖీల సందర్భంగా లాడ్జ్‌లు,హోటళ్లలో గదుల కేటాయింపు విధానం,అతిథుల నమోదు పత్రాలు,గుర్తింపు కార్డుల ధృవీకరణ,సందర్శకుల వివరాల నమోదు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అలాగే సీసీ కెమెరాల అమరిక,పనితీరు,భద్రతా ప్రమాణాల అమలు పై ప్రత్యేక దృష్టి సారించారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు,ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆస్కారాలు కల్పించరాదని లాడ్జ్ యాజమాన్యాలకు, పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా పేకాట,మద్యం సేవనం,ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన పక్షంలో బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.