prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 4:32 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ముమ్మరంగా పూడిక తీత పనులు పర్యవేక్షించిన కమిషనర్ అలీమ్ బాషా

మంగళగిరి జూన్ 02 ప్రజావాణి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని కల్పించేందుకు మరియు వర్షపు నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృత స్థాయిలో చిన్న ,పెద్ద డ్రెయిన్ ల డీ-సిల్టింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళగిరి లోని పార్క్ రోడ్డు,తాడేపల్లి లో ఉండవల్లి నందు ప్రధాన డ్రెయిన్స్ నందు పూడిక తీత పనులు ప్రత్యెక సిబ్బంది,ప్రత్యేక JCBల ద్వారా జరుగుతున్నవి.ఈ నేపద్యం లో నగరంలోని ప్రధాన కాలువలు, ఉప కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు మరియు అంతర్గత డ్రెయిన్లలో పేరుకుపోయిన మట్టి, సిల్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్త మరియు ఇతర అడ్డంకులను ప్రత్యేక యంత్రాలు, జేసీబీలు, ఎక్స్‌కవేటర్లు మరియు పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో తొలగిస్తున్నారు. డ్రెయిన్ల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి, వర్షపు నీరు ఎటువంటి అవరోధాలు లేకుండా సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులలో గుర్తించిన కీలక డ్రెయిన్లు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాధాన్యత ఆధారంగా డీ-సిల్టింగ్ పనులు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి నిల్వలు, రోడ్లపై ముంపు పరిస్థితులు మరియు ప్రజలకు కలిగే ఇబ్బందులను నివారించేందుకు ప్రణాళికా ప్రకారం అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా డ్రెయిన్లలో నీటి ప్రవాహం మెరుగుపడటంతో పాటు దోమల వ్యాప్తి, దుర్వాసన, వ్యాధుల ప్రబలడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా నగర పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపడి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుంది. ఈ నేపద్యం లో మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ కమీషనర్ అలీమ్ బాషా నగరం లోని పార్క్ రోడ్డు నందు జరుగుతున్న డ్రెయిన్ పూడిక తీత పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రెయిన్లు, కాలువలు మరియు రహదారి పక్కన ఉన్న నీటి పారుదల మార్గాలలో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు మరియు ఇతర చెత్తను వేయకుండా సహకరించాలని,డ్రెయిన్లలో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి డ్రెయిన్ లు పూడిపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.అదేవిధంగా, డ్రెయిన్లకు సంబంధించిన సమస్యలు, వర్షపు నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు, చెత్త సేకరణ, దోమల నివారణ లేదా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ప్రజలు మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ నెంబర్ లను 70939 12653,08645-295192 సంప్రదించుట ద్వారా సత్రవ పరిష్కార చర్యలు చేపట్టుట జరుగునని తెలిపారు.స్వచ్చ్చ మంగళగిరి దిశగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ, నగర పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నగర పాలక సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.