గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయడమైనది ఏమనగా,రాబోయే జనగణన 2027 ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయుటకై మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించుటకై, మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక 5K రన్ కార్యక్రమం నిర్వహించబడుచున్నది.ఈ కార్యక్రమం 26 ఏప్రిల్ 2026 (ఆదివారం) న ఉదయం 7 గంటలకు నిర్వహించబడును.ఈ 5K హలో ఇడ్లీ,మంగళగిరి వద్ద ప్రారంభమై, మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగుతుంది.అలాగే,ప్రజలు సౌకర్యవంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు (స్వీయ గణన)సదుపాయం ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచబడింది.ఈ స్వీయ గణన లో ప్రక్రియ ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.అందువల్ల ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని,సరైన సమాచారం నమోదు చేయవలసిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జనగణన యొక్క అవసరం,సమగ్రత మరియు సమాజాభివృద్ధిలో దాని పాత్రను వివరించడమే ముఖ్య ఉద్దేశ్యం.ఈ సందర్భంగా,మంగళగిరి తాడేపల్లి పరిధిలోని యువత,మహిళలు,విద్యార్థులు ఉద్యోగులు మరియు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేయడమైనది.ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఎంతో కీలకమైయుంది.కావున,నగర ప్రజలు ఈ 5K రన్‌లో పాల్గొని, జనగణన 2027 పై అవగాహన పెంపొందించేందుకు తోడ్పడగలరని ఆశిస్తున్నాము.