మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో జనగణన 2027 తొలి విడత ప్రారంభం*
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 01) మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో జనగణన 2027 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు కార్పొరేషన్ కమిషనర్ అలీం భాషా తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా, తొలి విడతలో ఇంటి నిర్మాణం, గృహ వసతులు వంటి కీలక వివరాల సేకరణను ఈరోజు మంగళగిరిలోని శాలివాహన నగర్‌లో ప్రారంభించారు.ఇంటి వద్దే వివరాల సేకరణ ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి గృహ యజమానులను కలిసి, వారి నివాస గృహాల నిర్మాణం, అందుబాటులో ఉన్న...