prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:36 am Digital Edition : PRAJA VANI

భూ భారతి రీ సర్వేకు శ్రీకారం

భూ భారతి రీ సర్వేకు శ్రీకారం

పినపాక పట్టినగర్ లో భూమి హక్కుల పరిరక్షణకు ప్రతిష్టాత్మక సర్వే  ప్రారంభం తహసీల్దార్,… ప్రసాద్

బూర్గంపాడు (ప్రజావాణి ప్రతినిధి )జూలై 15,.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి అమలులో భాగంగా  భూమి రికార్డులను పారదర్శకంగా రూపొందించి బుయజమానుల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టి నగర్ గ్రామంలో రి సర్వే కార్యక్రమాన్ని తాసిల్దార్ ప్రసాద్ ప్రారంభించారు. తాసిల్దారు ప్రసాద్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు మరియు సర్వే బృందం గ్రామంలో సరిహద్దులను గుర్తిస్తూ సర్వే చేపడుతున్నారు. భూములకు సంబంధించిన రికార్డులోని లోపాలను సరిదిద్దడం హద్దులను, ఖరారు చేయడం,. భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పినపాక పట్టినగర్ సర్పంచ్ బానోత్ పద్మ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్వే సమయంలో సంబంధిత భూ పత్రాలతో అధికారుల వద్దకు వచ్చి పూర్తి సహకారం అందించాలన్నారు. గ్రామంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఉప సర్పంచ్ తోటమల్ల వెంకటరమణ మాట్లాడుతూ పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీ ప్రజలు క్రమశిక్షణ  మరియు నిబద్ధతతో  రెవెన్యూ అధికారులకు సహకరించాలన్నారు. ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకురావాలన్నారు. రెవెన్యూ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు మాట్లాడుతూ సర్వే పూర్తయిన అనంతరం  భూమి రికార్డులు మరింత పారదర్శకంగా మారడంతో పాటు  భవిష్యత్తులో భూవివాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. గ్రామ ప్రజలు సర్వే బృందానికి సహకరించి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోతు పద్మ , ఉప సర్పంచ్ తోటమల్ల వెంకటరమణ , స్థానిక గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ జిపిఓ  కాక.శ్రీను సర్వే  అధికార బృందం పాల్గొన్నారు