prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 1:57 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

భూమికోసం ఉపాధి పనుల కోసం మే 7వ తేదీ బహిరంగ సభను జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27)  పోరుమామిళ్ల మండల కేంద్రంలో జిల్లా మహాసభల కరపత్రాలను సోమవారం విడుదల చేశారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా మా హాసభలు మే 7 8 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మే 7వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ర్యాలీ బహిరంగ సభ బద్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హాజరవుతున్నారని అన్నారు 8వ తేదీ జిల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధుల మహాసభ జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ వీరయ్య తెలిపారు.పోరుమామిళ్ల మండల కేంద్రంలో జిల్లా మహాసభల కరపత్రాలను సోమవారం విడుదల చేశారు సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ గ్రామీణ వలసలు నివారించడానికి కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతి లోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు నేడు ఫేష్ యాప్ వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు రెండు పూటలా పనులు రెండు పూటలా మాస్టర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలీల పైన ఒత్తిడి చేస్తున్నాయి దీనివల్ల కూలీలు నెట్వర్క్ లేకపోవడంతో కూలీలు పనుల నుండి నిష్క్రమణ పొందుతున్నారు కూలీలకు పనులు కల్పించ లేక పోతున్నారు కాబట్టి వెంటనే ఏషియా రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములు అన్యక్రాంతం భూములు కబ్జాదారులు వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు రెండు ఎకరాలు చొప్పున భూ పంపిణీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన పేదలకు భూ పంపిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం వైసిపి భూ పంపిణీ అమలు చేయకపోవడం వల్లనే ఓటమిపాలైందన్నారు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా గ్రామీణ ప్రజల పట్ల ఇళ్ల స్థలాలు భూ పంపిణీ అమలు చేయకుండా వ్యవహరిస్తున్నదని అన్నారు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం చేయటం వల్ల రైతాంగం పండించిన అరటి ఇతర పంటలు తీవ్రంగా నష్టపోయారు కేంద్ర ప్రభుత్వం అరటి రైతుల ఆదుకోవడంలో వైఫల్యం చెందింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇంధన తీవ్ర కొరత ఏర్పడుతుంది రైతాంగం వర్రీ కోతలకు యంత్రాలకు ట్రాక్టర్లకు ఆటోలకు డీజిల్ లేక తీవ్రంగా నష్టపోతున్నారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డి గ్యాస్ ఇంధన సమస్యలు పరిష్కారం కోసం టాస్క్ ఫోర్స్ నియమించాలని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మికులు అందరూ భూమి కోసం ఉపాధి పనుల కోసం బద్వేలు పట్టణంలో మే 7వ తేదీ సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని సాగుతెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వీరభద్రయ్య సత్యమయ్య సుబ్బరాయుడు భాష తదితరులు పాల్గొన్నారు