prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 2:04 am Digital Edition : PRAJA VANI

భీమ్ కాలనీలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు <br>

జై భీమ్ కాలనీలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

* భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది

* కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి ప్రశాంత్

జమ్మికుంట ఏప్రిల్ 14 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు జై భీమ్ కాలనీలో ఎస్సీ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞాన చిహ్నం,భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతివేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి నోటి తీపి చేసుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి ప్రశాంత్ మాట్లాడుతూ అంబేద్కర్ ని ప్రపంచం ఒక మేధస్ కలిగిన వ్యక్తిగా గుర్తిస్తే భారతదేశంలో మాత్రం కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేసి ప్రస్తుతం నడుస్తున్న రోజులలో చిన్న చూపుతో  చూపెడుతుంది అంబేద్కర్ కేవలం కొన్ని వర్గాలకే మాత్రమే కాదు అన్ని కులాలకు రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించి పోరాడి సాధించుకో అని చెప్పిన ఒక గొప్ప విద్యావేత్త. ఆర్టికల్ 341 ఎస్సీల కోసం ఆర్టికల్ 342 ఎస్టీల కోసం ఆర్టికల్ 342A ఓబీసీల కోసం మరియు అగ్రవర్ణ కులాలలో ఉన్న ప్రజల కోసం ఆర్టికల్ 15(6)6 అండ్ ఆర్టికల్ 16(6) సవరణ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన యోధుడుఇన్ని కులాలకు వాళ్ళ హక్కులను కల్పించిన తత్వవేత్తను కొన్ని కులాలకు పరిమితం చేయకూడదు అని రాబోయే జయంతిని పండుగ వలె అన్ని మతాలవారు వాళ్ల పండుగలు ఏ విధంగా అయితే సంబరంగా చేసుకుంటారు అదే విధంగా అంబేద్కర్ జయంతిని కూడా పండుగ వలె జరిపించాలని ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాం. రాజబాబు ఉపాధ్యక్షులు మారాపెల్లి యాదగిరి శనిగరపు రవి కోశాధికారి బోడికల రాజు కార్యదర్శి (మీడియా ఇంచార్జి ) తిప్పరపురాజానర్సింహాసలహాదారులు శనిగరపు సంపత్, పరాందుల వీరభద్రయ్య, పోగుల పోచయ్యవివిధ పార్టీ నాయకులు దేవేందర్,బోయిని కుమార్ గండికోట సమ్మయ్య, పల్లపు రవి లొకిని రాజేష్ అంబేద్కర్ వాదులు ఇల్లందుల రాజు కుర్ర రాజుమారాపెల్లి పోచాలుచిలువేరు ప్రసాద్ మారాపెల్లి ఏలీయా ఆకునూరి రాజు దాసారపు శ్రీనివాస్ వస్కులా విజయ్ కర్పూరి శ్రీనివాస్ మహిళలు మారాపెల్లి సరిత శోభారాణి ఏమేలా జూపాక సరోజన  వృద్ధులు పిల్లలు తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.