భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ
భీమారం,జూలై21,ప్రజావాణి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు,పరిధిలోని గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి,స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానంలో భాగంగా పోలీస్...