భార్యపై కత్తెరతో దాడి చేసిన భర్త.. ఘట్కేసర్‌లో కలకలం

ఘట్కేసర్, జూలై 24: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు మహమ్మద్ ఫహద్ సైఫుల్లా (24) తల్లిదండ్రులు సుమారు 26 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. గత ఐదు...