భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు! రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి
కమిషనరేట్ పరిధిలో డ్యామ్‌లు, పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత ఆపద వస్తే 'డయల్-100'కు కాల్ చేయండి రామగుండం జూలై 30 ప్రజావాణి : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల...