భారత రాజ్యాంగంపై అవగాహన పెంపుదలే లక్ష్యం – గ్యారా గోవర్ధన్

ఘట్‌కేసర్, ఏప్రిల్ 19 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 262వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఘట్‌కేసర్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది గ్యారా గోవర్ధన్ హాజరై డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్యారా గోవర్ధన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, అందుకే 20 రాజ్యాంగ పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు....