
బద్వేల్ జూన్ 10 ప్రజావాణి దేశం లో ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ బుధవారంనాడు రికార్డు నెలకొల్పడం నవ భారత ఆవిష్కరణకు శుభ సూచకమని సుప్రజ వ్యాఖ్యానించారు.మే 26,2014న ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన మోడీ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు.ఇప్పటి వరకు దేశ ప్రధానులుగా చేసిన 11 మందిలో మొదటి ప్రధాని స్వర్గీయ నెహ్రూ 4,398 రోజులు పదవిలో ఉన్నారు.గత పన్నెండేళ్లలో ప్రధాని శ్రీ మోడీ నాయకత్వంలో దేశంలో పలు రంగాల్లో అనూహ్యమైన,సానుకూలమైన, ప్రజోపకరమైన మార్పులు సంభవించాయని,ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ ఖ్యాతి ఇనుమడించిందని తెలిపారు.2014 లోక్ సభ ఎన్నికలకు ముందు కొన్నేళ్లుగా దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితుల వల్ల నైరాశ్యానికి గురై సమర్ధవంతమైన నాయకుని కోసం ఉవ్విళ్లూరిన ప్రజలు శ్రీ నరేంద్ర మోడీని స్పష్టమైన మెజారిటీతో ప్రధానిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.ప్రజల ఆశలు,ఆకాంక్షల మేరకు వారు తనపట్ల ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమర్ధ నాయకత్వం,సుపరిపాలన,సంస్కరణలు,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు ద్వారా మరో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికవడం విశేషమని అన్నారు.