భవిష్యత్ తరాల కోసం పంట మార్పిడి మహబూబాబాద్‌లో ప్రాజెక్ట్ వైవిధ్యంకు శ్రీకారం

తక్కువ నీటితో అధిక ఆదాయమే లక్ష్యం.. రైతులు ఆరుతడి,పంటల వైపు మళ్లాలి. విత్తనమేళలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపు. మహబూబాబాద్, కేసముద్రం జులై 27, ప్రజావాణి. వాతావరణ మార్పులు, తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాల క్షీణత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ వరి సాగుకు బదులుగా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం, ఆహార భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పంటల వైవిధ్యమే...