prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 12:25 pm Digital Edition : PRAJA VANI

భలే మంచి చౌక..బేరం..! ఫారెస్ట్ స్థలాలు సెంటు 1 లక్షలు మాత్రమే.. రండి..బాబు..రండి.. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణo సోముల వారి పల్లెలో ఈ ఘటన

భలే మంచి చౌక..బేరం..!

ఫారెస్ట్ స్థలాలు సెంటు 1 లక్షలు మాత్రమే..

రండి..బాబు..రండి..

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణo సోముల వారి పల్లెలో ఈ ఘటన

డిప్యూటీ సీఎం సారూ.. మీరు కూడా మా ఊరికి రారు..?

సెకండ్ ముంబైలో..ఫారెస్ట్ స్థలం లో ఓ ఫామ్ హౌస్ కట్టుకోరు..సారూ

ప్రొద్దుటూరు మిత్రులారా.. మీకు ఇక్కడ ఇల్లు లేదా.. సెంటు జాగా కూడా లేదా..అయితే త్వరగా వచ్చేయండి..ప్రభుత్వం నుండి తేరగా వచ్చిన ఫారెస్ట్ స్థలాన్ని సెంటు ఒక్క లక్షలకే ఇస్తున్నాము..రండి..

దయచేయండి.. మంచి తరుణం మించిన దొరకదు..ఇదండీ ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో హాట్ టాపిక్..సోములవారిపల్లె పంచాయతీ ప్రాంతంలో ఓ ఫారెస్ట్ అధికారిని చేస్తున్న ఘనకార్యం ఇది..ఇదేంటీ అని అడిగేవాళ్లు లేక పోవడంతో ఆ అమ్మయ్య ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతోంది..వాస్తవంగా ప్రొద్దుటూరుకు పెన్నా నదీ పక్కనే ఉంది..ఈ ఏటివారన ఉండే స్థలాన్ని ప్రభుత్వం ఫారెస్ట్ స్థలం అప్పుడెప్పుడో దిక్కులేని పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారు.. అలాంటిది ఇక్కడ 542/1సర్వే నెంబరులో 148 ఎకరాలు ఉంది..అప్పట్లో ఎవరికి వాళ్లు ప్రభుత్వం ఫారెస్ట్ స్థలాన్ని నిరుపేద కుటుంబాలు గుడిసెలను తీసుకున్నారు..అయితే ఈ స్థలాలను కేవలం ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగనివ్వకుండా ఉండేలా చూసుకోవాలి ఫారెస్ట్ అధికారులు.. ఆ ప్రాంతంలో వన్యప్రాణులు సంరక్షణ పచ్చని చెట్లను పెంచాలి.. కానీ ఇక్కడ ఓ ఆ ఫారెస్ట్ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా సెంటు భూమి లక్ష రూపాయల చొప్పున అమ్మేసుకుంటుంది..ఇది చట్ట విరుద్ధం.. ఇదంతా జరుగుతుంటే ప్రొద్దుటూరులో ఆ శాఖ అధికారులు ఉన్నట్టా.. లేనట్టా..

 

ఈ ఫారెస్ట్ అధికారి అమ్మయ్య ను..సస్పెండ్ చేసేంతవరకు..లేదంటే ప్రభుత్వం నుంచే రిమూవ్ చేసేంతవరకు నా ఈ పోరాటం ఆగదు..

మా వారాహి అమ్మ వారి గుడిని నిట్టు నిలువునా కూల్ చేస్తారా..

 

విలాసవంతమైనటువంటి భవనాలు..రిసార్ట్లు..ఫారెస్ట్ ల్యాండ్ లో నియమించుకుంటే..వాళ్ల నుంచి మామూలు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తారా..

 

మా హిందూ ధర్మాన్ని నిట్టు నిలువునా కూల్చేసే అధికారం ఎవరిచ్చారు అమ్మయా..

 

ఈ అధికారి లీలలు మరెన్నో ఎన్నెన్నో..