భర్త వేధింపులు తాళలేక ఫ్యాన్ కు ఉరి గోవిందరావుపేటలో విషాదం- కేసు నమోదు

గోవిందరావుపేట (ప్రజావాణి) గోవిందరావుపేటకు చెందిన పాషికంటి సంధ్య(37) తన తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త పసరకు చెందిన పాషికంటి గణేష్ గత 4 ఏళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సంధ్యను మానసికంగా, శారీరకంగా వేధించాడని తల్లి నరసమ్మ ఆరోపించారు. అత్తమామలు కూడా వేధింపులకు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పెద్దల రాజీ ప్రయత్నాలు విఫలం కావడంతో వారం క్రితం సంధ్య పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లిన సమయంలో సంధ్య ఈ దారుణానికి పాల్పడింది....