prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:03 pm Digital Edition : SRIKANTH MULUGU

భద్రాచలం–వాజేడు రహదారికి మోక్షం కల్పించండి

.100 కి.మీ.కు 3 గంటలు – రహదారి దుస్థితిపై మంత్రి తుమ్మల ఆగ్రహం.
.వారం రోజుల్లో పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్ మార్పు.

భద్రాచలం/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

భద్రాచలం నుంచి వాజేడు వరకు అధ్వాన్నంగా మారిన రహదారికి తక్షణమే మోక్షం కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు AP R&B మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కోరారు.
ఈ మార్గంలో ప్రయాణించిన సందర్భంగా స్థానికులు రహదారి దుస్థితిని వివరించారు. 100 కి.మీ. ప్రయాణానికే 3 గంటలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలకు స్పందించిన మంత్రి తుమ్మల AP, తెలంగాణ R&B ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
వారం రోజుల్లో పనులు ప్రారంభించి ప్రజల కష్టాలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.పనులు ప్రారంభం కాకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు పిలవాలని కోరారు. దీనికి మంత్రి జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
మొత్తం 112.6 కి.మీ రహదారిని ₹115.28 కోట్లతో 3 ప్యాకేజీలుగా అభివృద్ధి చేయనున్నారు.
భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.