భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం పి డి యస్ యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర
ప్రజావాణిన్యూస్(మార్చి23)రాజంపేట జాతీయ ఉద్యమ నాయకులు కామ్రేడ్ భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ ల 95వ వర్ధంతి సభ రాజంపేట పట్టణంలోనే గీతాంజలి డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి డి ఎస్ యు) ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ,స్వతంత్రం కోసం ఎంతోమంది విద్యార్థులు,యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు.వారిలో అగ్ర గన్యలు కామ్రేడ్స్ భగత్...