భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ
బెజ్జంకి,జూన్ 25 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట చుట్టూ గురువారం భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంతో గోవింద నామస్మరణ చేస్తూ గిరి...