బ్రాహ్మణ, హిందూ సమాజానికి ఎమ్మెల్యే శామ్యూల్ బేశారతుగా క్షమాపణ చెప్పాలి

హిందూ మనోభావాలను దెబ్బతీశారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్‌పై అర్చక సంఘాల ఫిర్యాదు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 17(ప్రజావాణి): టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా కంభంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతల స్వీకార వేడుకలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గాంధీభవన్ వేదికగా హిందూ ధార్మిక వ్యవస్థను, వేదమంత్రాలను, బ్రాహ్మణ అర్చకులను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఉమ్మడి మండలాల అర్చక పురోహిత, బ్రాహ్మణ సంఘం మండిపడింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ తహసీల్దార్‌కు, స్థానిక పోలీస్...