prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 10:40 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

బ్రాహ్మణ, హిందూ సమాజానికి ఎమ్మెల్యే శామ్యూల్ బేశారతుగా క్షమాపణ చెప్పాలి

హిందూ మనోభావాలను దెబ్బతీశారు

ఎమ్మెల్యే మందుల శామ్యూల్‌పై అర్చక సంఘాల ఫిర్యాదు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 17(ప్రజావాణి):

టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా కంభంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతల స్వీకార వేడుకలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గాంధీభవన్ వేదికగా హిందూ ధార్మిక వ్యవస్థను, వేదమంత్రాలను, బ్రాహ్మణ అర్చకులను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఉమ్మడి మండలాల అర్చక పురోహిత, బ్రాహ్మణ సంఘం మండిపడింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ తహసీల్దార్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. శామ్యూల్ వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్, ఎండపల్లి ఉమ్మడి మండలాల సంఘం అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి భూమయ్య చారి, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణస్వామి, జగిత్యాల జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం గౌరవాధ్యక్షులు పదిరె నారాయణరావు, పూర్వ మండల అధ్యక్షులు ఎడ్లపల్లి రాజశేఖర్ శర్మ, జక్కాపురం లక్ష్మి స్వామి సింహాచలం నరేష్, అహోబలం దీపక్ శర్మ, రాజమౌళి, కొండపల్లి శరత్ బాబు, తూర్పుగోదావరి అల్వార్ స్వామి, కొండపర్తి వేణు చారి, గౌరయ్య చారి, ఘంట్యాల విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.