ఎమ్మెల్యే సొంత మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎందుకు నోచుకోలేదు?ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా?విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారెవరు?
బ్రహ్మంగారిమఠం (ప్రజావాణి జూన్ 13) మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.మండల కేంద్రంలోని బాలురు హైస్కూల్ వెనుక భాగాన రెండు అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ జూనియర్ కాలేజీ ఎందుకు ప్రారంభించలేదుప్రతి సంవత్సరం బాలుర హై స్కూల్,బాలికల హైస్కూల్, వివిధ ప్రవేట్ పాఠశాలల నుంచి సంవత్సరానికి 500 మందికి పైగా విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణులై పై తరగతులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది.ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకుండా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చేందుకు అధికారులు పనిచేస్తున్నారా? అంటూ ప్రజలను చర్చ మొదలైంది.ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు కాకుండా ఏ రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయి? ఎంతోమంది పేదవారు ఉన్న ఈ ప్రాంతంలో ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోతున్నారు?స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టి బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం అయినా ప్రారంభించేలా దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఇంటర్మీడియట్ కాలేజీ కావడమే దీనికి శాపమా?అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరం చేసినట్లేనా?