prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 3:41 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బ్రహ్మంగారిమఠంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి* CPM డిమాండ్

బ్రహ్మంగారిమఠం లో బస్ షెల్టర్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రజావాణి న్యూస్(మార్చి31)   గొడుగులతో వినూత్న నిరసన చేపట్టిన ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠం లో బస్ షెల్టర్ లేక భక్తులు,గ్రామస్తులు, యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారి ఇబ్బందులను గమనించి వెంటనే మఠం 5,రోడ్ల సెంటర్ లో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ చేశారు,మంగళవారం నాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మఠం 5,రోడ్ల సెంటర్లో గొడుగులు.ధాన్యంపట్ట నీడగ పెట్టుకుని వినూత్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ తో కలసి వారు మాట్లాడుతు భూత,భవిష్యత్తు వర్తమానకాలాలను తత్త్వలద్వార ప్రపంచానికి తెలియజేసి కాలం మార్పును ప్రపంచానికి చూపిన యోగి,కులం గోడలను కూల్చిన భోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు సజీవ సమాధి వహించిన గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం అని వారన్నారు, ఇటువంటి పుణ్యక్షేత్రంలో బస్ సెల్డర్ లేక వివిధ రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులు భక్తులు,మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు ఆవేదనవెళ్ళ బుచ్చారు మండలఅభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో రొడ్లవెడల్పు సందర్భంగ బస్ షెల్టర్ తొలగించారని త్వరలోనే మరో షెల్టర్ ఏర్పారుచేస్తామని చెప్పి సంవత్సరాలు గడిచాయని గత ప్రభుత్వం పోయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని వారు గుర్తు చేశారు.ప్రస్తుత ఎమ్మెల్యే గారు బస్ సేల్డర్ ఏర్పాటు చేస్తామని పత్రికా ముఖంగ తెలిపి నెలలు గడుస్తున్నాయని. సెల్డర్ ఏర్పాటు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని దీనికంతటికీ కారణం కూటమి నాయకుల మద్య ఉన్న వైరుధ్యాలు వ్యక్తిగత ప్రాకులాటే కారణమని సోషల్ మీడియాలో రోజువారి కథనాలు వస్తున్నాయని వారు గుర్తు చేశారు.
సేల్డర్ లేని కారణంగ భక్తులు,యాత్రికులు టి అంగల్ల దగ్గర పండ్ల బండ్ల దగ్గర పందులు,ఆవులు, కుక్కలు,తాగుబోతులతో ఎండకు వానకు ఇబ్బందులు పడుతూ బక్తితో వచ్చినవారు ఉసూరుమంటూ తిరుగు ప్రయాణం అవుతున్నారని వారు ఆవేదనవెళ్ళబుచ్చారు, వెంటనే ఎమ్మెల్యే గారు,సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని తాత్కాలిక బస్సు సేల్డర్ ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో భిక్షాటన ద్వారానైన బస్ సేల్డర్ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు,ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాన గోవిందస్వామి రెబ్బా నరసింహులు రాహుల్,భాస్కర్ ఆంజనేయులు అరవింద్,దేవా గుర్రయ్య రమణ,కేశవ, శ్రీనివాసులు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.