prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 1:42 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బ్యాంకింగ్ మోసాల నివారణపై ICICI బ్యాంక్ అధికారులతో కలిసి వర్క్ షాప్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు,

ఎన్.టి.ఆర్.జిల్లా  (మే20 ప్రజావాణి) విజయవాడ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం,మారుతున్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నారని,వీటిని అరికట్టడానికి బ్యాంక్ సిబ్బంది,పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.పోలీస్ కమిషనరేట్ మరియు ICICI బ్యాంక్ లిమిటెడ్ (ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ గ్రూప్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు సైబర్ క్రైమ్ డి.సి.పి.శ్రీమతి కె కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.పర్యవేక్షణ లో పోలీసు అధికారులకు,”బ్యాంకింగ్ మోసాల నివారణ మరియు దర్యాప్తు అనే అంశంపై ఒక ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.డి.సి.పి.లు శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్.శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్.శ్రీ డా కె.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్.శ్రీమతి కె. జి.వి.సరిత ఐ.పి.ఎస్,శ్రీమతి కె కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.శ్రీ ఏ.బి.టి స్.ఉదయరాణి ఐ.పి.ఎస్.ఏ.సి.పి.లు,ఇన్స్పెక్టర్,ఎస్.ఐ.లతో పాటు ICICI బ్యాంక్ ప్రతినిధులైన శ్రీ నీలేష్ దేశ్ పాండే,శ్రీ రజనీష్ కన్నా,శ్రీ సందీప్ మెహర,శ్రీ అన్నజీ రావు,తధితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఈ క్రింది విషయాలపై కూలంకషంగా చర్చించారు:సరికొత్త మోసాలపై అవగాహన: ప్రస్తుతం సమాజంలో కలకలం రేపుతున్న’డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లు,ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు,లోన్ యాప్ వేధింపులు,మరియు కరెంట్ అకౌంట్ల దుర్వినియోగం వంటి ఆర్థిక నేరాల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.త్వరితగతిన దర్యాప్తు బ్యాంకింగ్ మోసాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను ఎలా గుర్తించాలి,త్వరితగతిన నిధులను ఎలా ఫ్రీజ్ చేయాలి,మరియు కేసుల దర్యాప్తులో పాటించాల్సిన చట్టపరమైన వ్యూహాలపై ICICI బ్యాంక్ నిపుణులతో కలిసి విస్తృతంగా చర్చించారు.బ్యాంకర్ల అప్రమత్తత సేవింగ్స్ ఖాతాల నుండి కరెంట్ ఖాతాలకు మార్పిడి జరిగే సమయంలో కస్టమర్ల వివరాలను పూర్తిగా పరిశీలించాలని,అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.మాట్లాడుతూ.సైబర్ మరియు బ్యాంకింగ్ నేరాలు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి.సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ బ్యాంకులు పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం చేయగలం. ప్రజలు కూడా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వాట్సాప్ లేదా వీడియో కాల్స్ నమ్మి ‘డిజిటల్ అరెస్ట్’భయానికి లోనుకావద్దు.ఎలాంటి ప్రభుత్వ సంస్థ కూడా డబ్బులు డిమాండ్ చేయదని గ్రహించాలి అని తెలిపారు. ఎవరైనా బ్యాంకింగ్ లేదా సైబర్ మోసానికి గురైతే,ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి.మోసం జరిగిన మొదటి గంట లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.